ట్రైస్టేట్ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

ట్రైస్టేట్ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

17-04-2018

ట్రైస్టేట్ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

చికాగోలో ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఏప్రిల్‌ 7న ఘనంగా నిర్వహించారు. వరుణ్‌ వాసిరెడ్డి ఆలపించిన ప్రార్థన గీతంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రవి అవసరాల బృందం గానం చేసిన రామదాసు కీర్తనలు ఆహూతులను ఎంతో ఆకట్టుకున్నాయి. మోనికా కౌశిక్‌ ఎర్రమిల్లి, షీలా కౌశిక్‌ ఎర్రమిల్లి చేసిన వేద పఠనం అక్కడి వారి మనసులను దోచుకుంది. అపర్ణ ప్రశాంత్‌, లాస్య మరువాడ, ఇషా సుబ్రహ్మణ్యం, రష్మీ, ప్రాచి  తదితరులు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. రామ రావణ యుద్ధ నాటకంలో భాగంగా రావణాసురుడి పాత్రను పోషించిన అపర ప్రశాంత్‌ తన నటనా కౌశలంతో ఆకట్టుకున్నారు. జానకి ఆనంద వల్లి నాయర్‌ చేసిన ఫ్యూషన్‌ డాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తారానా డాన్స్‌ అకాడమీ వారి కథక్‌ నృత్య ప్రదర్శన, రాజగోపాల్‌ (నాట్య డ్యాన్స్‌ థియేటర్‌) గంగావతరణం నృత్య రూపకాలు అక్కడి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. దీప్తి చిరువూరి తన బృందంతో చేసిన ఉగాది ప్రత్యేక నృత్య ప్రదర్శన వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చింది.

 

అనుపమ చంద్రశేఖర్‌ బృందం చేసిన వాయిద్య సంగీత ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని చక్కటి ప్రతిభను కనబరిచారు. రాజేశ్వరి పరిటి ఆధ్వర్యంలో నిర్వహించిన అనికా అయ్యలరాజు వీణా వాదన, రత్న కల్లూరి ఆలపించిన అన్నమాచార్య గీతాలాపనం, రిషి మహదేవన్‌ మ దంగ వాయిద్యాలు వేడుకలకు శోభను తీసుకొచ్చాయి. సమన్విత కలిగొట్ల శాస్త్రీయ సంగీతంతో ఆకట్టుకున్నారు.  చిన్నారి స్వర ప్రియ పాడిన తెలుగు పాట, జయశ్రీ తటవర్తి దర్శకత్వంలో రూపొందించిన అంతర్యామి నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. జ్యోతి వంగర బృందం వారి శ్రీరామ న త్య రూపకం, శ్రీలత ఏరామటి బృంతం గానాలాపన అందరి ద ష్టిని ఆకర్షించింది. గరిమా సింగ్‌, దీప్తి షిండే చేసిన జగదానంద కారక న త్యంతో ఈ వేడుకలు ముగించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాధిక గరిమెళ్ల, ఉష పరిటి, ప్రణతి కలిగోట్ల, స్వప్న పులా, నీలిమ మైలవరపు, రాణి మాక్తినేని, దీప్తి చిరువూరి, హేమంత్‌ పప్పు, ఇతర బోర్డు సభ్యులు, కళాకారులకు ట్రై తెలుగు అసోసియేషన్‌ తరఫున బోర్డు సభ్యుడు రామకష్ణధన్యవాదాలు తెలిపారు.