రక్త మార్పిడికి కృతిమ రక్తం!
Nela Ticket
Kizen
APEDB

రక్త మార్పిడికి కృతిమ రక్తం!

21-04-2017

రక్త మార్పిడికి కృతిమ రక్తం!

కావాల్సిన గ్రూప్‌ రక్తం అన్ని వేళల్లోనూ అంతసులువుగా దొరకదు. సమయానికి రక్తం అందక రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఈ సమస్యకు అమెరికా జాతీయ గుండె, రక్తం, ఊపిరితిత్తుల పరిశోధన సంస్థ (యూఎస్‌ఎన్‌ హెచ్‌ఎల్‌బీఐ) నిపుణులు చక్కటి పరిష్కారం కనిపెట్టారు. రక్త మార్పిడిలో ఎర్రరక్త కణాల పాత్ర కీలకం. ఇవి శరరీంలోని వివిధ భాగాలకు హిమోగ్లోబిన్‌ను చేరవేస్తాయి. కణజాలానికి ఆక్సీజన్‌ను సరఫరా చేసేది హిమోగ్లోబినే. ఈ ప్రొటీన్‌లో రసాయనిక మార్పులు చేస్తూ కావాల్సిన గ్రూప్‌ రక్తం తయారీకి ఇదివరకు పరిశోధనలు జరిగాయి. అయితే మార్పుల వల్ల హిమోగ్లోబిన్‌ మెథోగ్లోబిన్‌గా మారుతూ ప్రాణావాయువును తీసుకుపోయే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం హిమోగ్లోబిన్‌కు పాలీడోపమైన్‌ అనే పాలిమార్‌ పూత వేయడంతో ఈ సమస్యకు కళ్లెంవేయొచ్చని గుర్తించామని పరిశోధకులు హోంగ్‌ ఝౌ తెలిపారు. అంతేకాదు ఈ కృత్రిమ రక్తంతో హానికర విశృంఖల కణాలకు ఫ్రీరాడికల్స్‌కు) చెక్‌ పెట్టొచ్చని వివరించారు.