మనసులో మాట ఫేస్ బుక్ లోకి!
Nela Ticket
Kizen
APEDB

మనసులో మాట ఫేస్ బుక్ లోకి!

21-04-2017

మనసులో మాట ఫేస్ బుక్ లోకి!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచటానికి ఒక వేదికలా నిలిచిన ఫేస్‌ బుక్‌ తన వినియోగదార్లకు మరో వినూత్న సౌకర్యాన్ని కల్పించటానికి కసరత్తు ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే ఫేస్‌బుక్‌ యూజర్లు ఇకమీదట ప్రత్యేకంగా కంపోజ్‌ చేయాల్సిన అవసరమే ఉండదు. మనసులో మాటలను డైరెక్టుగా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. అంటే మీరు ఏ అభిప్రాయాలనైతే వెల్లడించాలనుకుంటున్నారో, వాటిని కంపోజ్‌ చేయకుండానే ఫేస్‌బుక్‌లో వ్యక్తపరచటానికి వీలవుతుందన్నమాట. సై లెంట్‌ స్పీచ్‌ సిస్టమ్‌ పేరుతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంపై ఫేస్‌బుక్‌ దృష్టి పెట్టింది.  ఆ సంస్థ ఏటా నిర్వహించే రెండురోజుల ఆధునిక టెక్నాలజీల సదస్సు  ఎఫ్‌8 కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు.