మెంఫిస్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
Nela Ticket
Kizen
APEDB

మెంఫిస్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

21-04-2017

మెంఫిస్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

మెంఫిస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో  హేవళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ వేడుకలు సౌత్‌ విండ్‌ హైస్కూల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టెన్నిసీ రాష్ట్ర జనరల్‌ అసెంబ్లీ ప్రతినిధి మార్క్‌వైట్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలాపనలు,  ఫ్యాషన్‌ షోలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మెంఫిస్‌ తెలుగు సమితి అధ్యక్షులు వాన రత్నాకర్‌, గౌరి ససిపల్లి, అనిల్‌ బయన్న, అశ్విన్‌ అన్నపురెడ్డి, చిరంజీవి గొంప, ఉమా బెల్డ్‌, రాఘవేంద్ర ధునికుల, పావని పెనుగొండ, రామచందర్‌ గోలి, జనార్థన్‌ పగడాల, సురేంద్రనాథ్‌ మొక్కపాటి, రంగ కురేటి, సందీప్‌ చిట్టి, గౌతమ సంధ్య మట్టే, ఫణి తెంగలపల్లి, రాజా చెన్నం, కృష్ణ పెరి, ప్రశాంతి నక్క తదితరులు పాల్గొన్నారు.