టాస్క్ ఉగాది వైభవం

టాస్క్ ఉగాది వైభవం

26-04-2018

టాస్క్ ఉగాది వైభవం

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టాస్క్‌) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను ఏప్రిల్‌ 14న వైభవంగా జరుపుకున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ లోని వాలి ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకలకు 2000 మందికి పైగా తెలుగు వారు హాజరయ్యారు. సినీ గాయనీ గాయకులు గీతామాధురి, మల్లిఖార్జున్‌, గోపిక పూర్ణిమ, తీన్మార్‌ మంగ్లి తమ పాటలతో వేదికను హోరెత్తించారు.  మిమిక్రీ కళాకారుడు శివా రెడ్డి సినీ మరియు రాజకీయ ప్రముఖులను అనుకరిస్తూ చేసిన పేరడీలు, జోక్స్‌ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. తెలుగు సినీ నాయకులు మంచు మనోజ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా సంప్రదాయ కోలాటం, ఉగాది కవితలు, రాఫుల్‌ బహుమతులు, ప్రపంచ డోలు న త్యం మరియు స్థానిక సాంస్క తిక కార్యక్రమాలు లాంటి ప్రత్యేకతలు మరెన్నో. సాహిత్యం, పద్య రచన మరియు ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. నాటా, నాట్స్‌, ఆటా, తానా, టాటా, సిలికానాంధ్ర తదితర జాతీయ సంస్థల పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చివరిగా టాస్క్‌ అధ్యక్షులు జైపాల్‌ రెడ్డి సాముల ఈ కార్యక్రమ విజయవంతానికి సహాయపడిన తోటి కార్యవర్గ సభ్యులు, దాతలు, వాలంటీర్స్‌ తదితరులకు కతజ్ఞతలు తెలియజేశారు.

Click here for Event Gallery