ఉత్తరకొరియా నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు

ఉత్తరకొరియా నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు

14-05-2018

ఉత్తరకొరియా నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు

తమ దేశంలో అణు పరీక్షల కేంద్రాలను విధ్వంసం చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప స్వాగతించారు. ఉత్తర కొరియా నిర్ణయంపై ప్రశంసలు జల్లు కురిపించిన ట్రంప్‌, అణ్వాయుధాలను వదులుకుంటే అన్ని రకాలుగా చేయూతనిస్తామని ప్రకటించారు. ఉత్తరకొరియా అణు పరీక్షల కారణంగా అమెరికా మొదట వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకుని మిత్రదేశాలను కూడా నార్త్‌ కొరియాకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ కిమ్‌ వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో ట్రంప్‌ వ్యక్తిగత దూషణకు దిగారు. ప్రతిగా కిమ్‌ దూషించడంతో వ్యవహారం బెదిరింపుల వరకు వెళ్లింది. అయితే ఇరుదేశాల మధ్య శతుత్వం తగ్గించడంతో దక్షిణకొరియా పోషించిన కీలపాత్ర, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో రాయబారం ఇరువురు నేతుల సింగపూర్‌ వేదికగా చర్చకు సిద్ధమయ్యేలా చేసింది.