తానా వాలీబాల్ పోటీలకు మంచి స్పందన

తానా వాలీబాల్ పోటీలకు మంచి స్పందన

16-05-2018

తానా వాలీబాల్ పోటీలకు మంచి స్పందన

కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, బావార్చి రెస్టారెంట్‌ నిర్వహించిన వార్షిక వాలీబాల్‌, త్రోబాల్‌ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ఎస్‌ఆర్‌ఎస్‌ కన్సల్టింగ్‌ గ్రూపు, స్వాగత్‌ ఇండియన్‌ కుజిన్‌, శ్రీధర్‌ సిపిఎ?ఈ పోటీలకు స్పాన్సర్‌లుగా వ్యవహరించారు. అడ్వాన్స్‌డ్‌, ఇంటర్మీడియెట్‌, బిగినర్స్‌ విభాగంలో పురుషులకు, మహిళలకోసం, యూత్‌కోసం ప్రత్యేకంగా పోటీలను నిర్వహించారు. మహిళలకోసం త్రోబాల్‌ పోటీలను కూడా నిర్వహించారు. దాదాపు 32 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. 250 మంది క్రీడాకారులు తమ ఆటను ఇందులో ప్రదర్శించారు. శివశేఖర్‌, విజయ్‌, రజనీకాంత్‌, యశ్వంత్‌ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ల ద్వారా వచ్చే డబ్బును తానా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తుందని వారు చెప్పారు.

ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి ఈ సందర్భంగా మాట్లాడుతూ, టోర్నమెంట్‌లో ఆటగాళ్ళు చూపిన ప్రతిభను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు తానా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. మధురావెల (తానా రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), శ్రీకాంత్‌ దొడ్డపనేని (తానా జాయింట్‌ సెక్రటరీ), సతీష్‌ వేమూరి (తానా కమ్యూనిటీ సర్వీసెస్‌), రజనీకాంత్‌ కాకర్ల (తానా స్పోర్ట్స్‌ చైర్‌) టోర్నమెంట్‌ను విజయవంతం చేసినవారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మధు రావెళ్ల తానా అడ్‌ హాక్‌ కమిటీని అందరికీ పరిచయం చేశారు. వెంకట్‌ అడుసుమిల్లి, వెంకట్‌ కోగంటి, యశ్వంత్‌ కుదరవల్లి, వినయ్‌ పరుచూరి, ఉమాకాంత్‌ ఉప్పలపాటి, లాల్‌ వెనిగళ్ళ, రామ్‌ తోట, జితేంద్ర కొత్తపల్లి, హరి నల్లమల, కెపి శ్రీకాంత్‌, భాను, మల్లిక్‌ మేదరమెట్ల, జెట్టి వెంకట్‌, కృష్ణమోహన్‌, భరత్‌ ముప్పిరాల, వెంకట్‌ కొల్లా ఈ కమిటీలో ఉన్నారు.