ట్రంప్ తో భేటీ రద్దు చేస్తాం : ఉత్తర కొరియా

ట్రంప్ తో భేటీ రద్దు చేస్తాం : ఉత్తర కొరియా

16-05-2018

ట్రంప్ తో భేటీ రద్దు చేస్తాం : ఉత్తర కొరియా

అణ్వాయుధాలను తగ్గించుకోవాలని ఒకవేళ అమెరికా ఒత్తిడి చేస్తే, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో జరగాల్సిన భేటీని రద్దు చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరిక జారీ చేసింది. జూన్‌ 12వ తేదీన ట్రంప్‌, కిమ్‌ మధ్య చరిత్రాత్మక భేటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదిలేస్తేనే ఆ దేశాధినేతతో సమావేశం అవుతామని అమెరికా గతంలో పేర్కొన్నది. దీంతో ఆ అంశంపై నార్త్‌ కొరియా స్పందించింది. అమెరికా తప్పుడు అభిప్రాయాలను వెలుబుచ్చుతున్నదని నార్త్‌ కొరియా మంత్రి ఒకరు తాజాగా ఆరోపించారు. నిజానికి కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధ వ్యాప్తిని అదుపు చేస్తామని నార్త్‌ కొరియా అంగీకారం తెలిపిన తర్వాతే ఆ దేశంలో సమావేశం నిర్వహించేందుకు అమెరికా అంగీకరించింది. కానీ అమెరికా పదేపదే నిరాయుధీకరణకు ఒత్తిడి చేస్తే మాత్రం చర్చలను రద్దు చేసేందుకు తాము వెనుకాడబోమని ఉత్తర కొరియా నేత ఒకరు సృష్టం చేశారు.