అమెరికా కాంగ్రెస్ ఎన్నికల బరిలో 80 మందికిపైగా భారతీయ అమెరికన్లు

అమెరికా కాంగ్రెస్ ఎన్నికల బరిలో 80 మందికిపైగా భారతీయ అమెరికన్లు

17-05-2018

అమెరికా కాంగ్రెస్ ఎన్నికల బరిలో 80 మందికిపైగా భారతీయ అమెరికన్లు

అమెరికా ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోని 35 స్థానాలకు నవంబరులో జరుగబోతున్న ఎన్నికల్లో 80 మందికిపైగా భారతీయ అమెరికన్లు పోటీ చేయబోతున్నారు. ఆసియా అమెరికన్లు, పసిఫిక్‌ దీవుల వాసులను కలిపితే ఈ సంఖ్య 220కు మించిపోతోంది. వీరిలో ఎక్కువ మంది డెమోక్రటిక్‌ పార్టీ తరపునే బరిలోకి దిగుతున్నారు. ప్రతినిధుల సభ, సెనేట్‌తోపాటు 39 రాష్ట్రాల్లోని భిన్న పదవులకూ ఈ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిపై శ్వేతసౌధం మాజీ అధికారి, భారతీయ అమెరికన్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌ వ్యవస్థాపకులు గౌతమ్‌ రాఘవన్‌ మాట్లాడారు. ఈ సారి పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు బరిలోకి దిగుతున్నట్లు వివరించారు. అమీ బెరా, రో ఖన్నాలతో పాటు రాజా కృష్ణమూర్తి, పరిమళ జయపాల్‌ తదితరులూ మరోసారి పదవులు చేపట్టేందుకు పోటీ చేస్తున్నారని చెప్పారు.