జుకర్ బర్గ్ పేరు వద్దు... తొలగించండి

జుకర్ బర్గ్ పేరు వద్దు... తొలగించండి

17-05-2018

జుకర్ బర్గ్ పేరు వద్దు... తొలగించండి

ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పాపులారిటీ రోజురోజుకీ పడిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని జుకర్‌బర్గ్‌ శాన్‌ఫ్రాన్సిస్కో ఆస్పత్రికి చెందిన నర్సులు ఆస్పత్రి భవనానికి పెట్టిన జుకర్‌బర్గ్‌ పేరును తొలగించాలని ఆందోళనలు చేపడుతున్నారు. మూడేళ్ల క్రితం జుకర్‌బర్గ్‌ ఆయన సతీమణి ప్రసిల్లా ఆప్పత్రికి విరాళంగా 75 మిలియన్‌ డాలర్లు ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో యాజమాన్యం ఆస్పత్రికి జుకర్‌బర్గ్‌ పేరు పెట్టింది. ఇప్పుడు జుకర్‌బర్గ్‌ కేంబ్రిడ్జి ఎనలిటికా వివాదంలో చిక్కుకోవడంతో ఆస్పత్రికి పెట్టిన ఆయన పేరును తొలగించాలని అందులో పనిచేస్తున్న పలువురు నర్సులు డిమాండ్‌ చేశారు.

ఎవరైనా ఆస్పత్రులకు, ఎన్జీవోలకు భూరి విరాళాలు ఇస్తే భవనాలకు వారి పేర్లు పెట్టడం అగ్రరాజ్యంలో సర్వసాధారణమే. అయితే జుకర్‌బర్గ్‌ పేరు తొలగించాలని ఆందోళనలు చేస్తున్న నర్సులకు ఎవ్వరూ మద్దతు తెలపకపోవడంతో ఆయన పేరును తొలగించడానికి ఆస్పత్రి అంగీకరించడం లేదు.