అర్కన్సస్‌ లో టీసీఎస్ కార్యాలయం

అర్కన్సస్‌ లో టీసీఎస్ కార్యాలయం

17-05-2018

అర్కన్సస్‌ లో టీసీఎస్ కార్యాలయం

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ అమెరికాలో తన కార్యకలాపాలను విస్తరించింది. తాజాగా అర్కన్సస్‌ లోని కార్యాలయంలో ట్రాన్స్‌ అమెరికా డీల్‌లో భాగంగా 200 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు సంస్థ నేడు తెలిపింది. జనవరిలో ట్రాన్స్‌ అమెరికా సంస్థతో టీసీఎస్‌ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం దాదాపు కోటి మందికి చెందిన వివిధ బీమా పాలసీలను నిర్వహించనుంది. దీనిపై టీసీఎస్‌ ఒక ప్రకటన చేసింది. '' ట్రాన్స్‌ అమెరికాతో ఒప్పందం కారణంగా డౌన్‌టౌన్‌ లిటిల్‌ రాక్‌లోని సెంటర్‌ వ్యూ భవనంలో పలు ఫ్లోర్లకు టీసీఎస్‌ విస్తరించింది. ట్రాన్స్‌ అమెరికా మాజీ ఉద్యోగులు 200 మంది ప్రస్తుతం టీసీఎస్‌ కోసం పని చేస్తున్నారు.'' తెలిపింది. ట్రాన్స్‌ అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఆ సంస్థకు చెందిన 2,200 మంది మాజీ ఉద్యోగులను టీసీఎస్‌ నియమించుకొని వారికి ఉద్యోగ భద్రత కల్పించనుంది. ప్రస్తుతం టీసీఎస్‌కు లిటిల్‌ రాక్‌ కార్యాలయం ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ఒకటి.