ఎటిసి కన్వెన్షన్ కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాక

ఎటిసి కన్వెన్షన్ కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాక

17-05-2018

ఎటిసి కన్వెన్షన్ కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాక

అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) కలిసి సంయుక్తంగా మే 31 నుంచి డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌కు ముఖ్య అతిథిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హాజరు కానున్నారని ఆటా అధ్యక్షుడు ఆసిరెడ్డి కరుణాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయనను కలిసి కన్వెన్షన్‌కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించినట్లు తెలిపారు. కరుణాకర్‌ వెంట ఆటా సభ్యులు బూజాల భువనేష్‌, తిరుపతి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.