గ్రామ సమస్యల పరిష్కారానికి ఏపీ జన్మభూమి కృషి

గ్రామ సమస్యల పరిష్కారానికి ఏపీ జన్మభూమి కృషి

17-05-2018

గ్రామ సమస్యల పరిష్కారానికి ఏపీ జన్మభూమి కృషి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న అమెరికాలోని ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి ఇప్పుడు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవుట్‌రీచ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రాజెక్టు చేపట్టామని జయరామ్‌ కోమటి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇంటర్న్‌షిప్‌కు 120 మంది విద్యార్థులను ఎంపిక చేశామని, వీరు గ్రామ, మండలస్థాయి అధికారులను కలిసి ఆ ప్రాంత సమస్యలను తెలుసుకుంటారని తరువాత వీటి పరిష్కారానికి వీలుగా ఎన్నారైలతో సంప్రదింపులు జరిపి వారి చేయూతతో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు.