అమెరికాను నిలదీసిన ఫ్రాన్స్

అమెరికాను నిలదీసిన ఫ్రాన్స్

12-06-2018

అమెరికాను నిలదీసిన ఫ్రాన్స్

కెనడాలో జరిగిన జి7 దేశాల సదస్సు జారీ చేసిన తుది ప్రకటన నుండి పక్కకు తప్పుకోవటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఫ్రాన్స్‌ నిలదీసింది. ఈ విషయంలో అమెరికా ప్రదర్శించిన వైఖరి పూర్తి అసృష్టతతో కూడి వుందని ఫ్రెంచ్‌ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తాము రెండు రోజులపాటు శ్రమించి ఈ ప్రకటన పాఠాన్ని రూపొందించామని, ఇందులో చేసిన అన్ని హామీలను తాము సమర్థిస్తున్నామని అధ్యక్ష కార్యాలయంలో ఈ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ సహకారం ఎప్పుడు ఆగ్రహం పైన లేదా మాటలపైనా ఆధారపడి వుండదని  ఫ్రెంచ్‌ అధ్యక్ష కార్యాలయం సృష్టం చేసింది. జి7 దేశాల సదస్సు జారీ చేసిన ప్రకటనను తాము గట్టిగా సమర్థిస్తున్నామని పునరుద్ఘాటించింది.