అణు నిరాయుధీకరణకు కిమ్ గ్రీన్ సిగ్నల్!

అణు నిరాయుధీకరణకు కిమ్ గ్రీన్ సిగ్నల్!

12-06-2018

అణు నిరాయుధీకరణకు కిమ్ గ్రీన్ సిగ్నల్!

అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామని ఉత్తర కొరియా నేత కిమ్‌, ఇవాళ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో సంతకం చేశారు. ట్రంప్‌, కిమ్‌ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇద్దరూ ఓ సమగ్ర ఒప్పందంపై సంతకం చేశారు. ఇంతకీ ఆ ఒప్పందంలో ఏముందన్న దానిపై సృష్టత లేకున్నా, అది నిరాయుధీకరణకు సంబంధించిన అంశమని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రెండు దేశాల ప్రజల శాంతి, సామరస్యం కోసం అమెరికా, నార్త్‌ కొరియా మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆ ఒప్పందంలో ఉంది. కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి కోసం రెండు దేశాలు సంయుక్తంగా చర్యలు చేపట్టేందుకు అంగీకరించాయి. ఏప్రిల్‌ 27, 2018 జరిగిన పన్‌ముంజన్‌ ఒప్పందంలో భాగంగా, కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ కట్టుబడి ఉన్నట్లు కూడా ఒప్పందంలో ఉంది. యుద్ధ ఖైదీలను మార్చుకోవాలని కూడా రెండు దేశాలు అంగీకరించాయి. ఆ ఒప్పందం డాక్యుమెంట్‌ను ట్రంప్‌ మీడియాకు చూపించారు.