కిమ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించా : ట్రంప్

కిమ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించా : ట్రంప్

12-06-2018

కిమ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించా : ట్రంప్

సింగపూర్‌లోని సెంటోసా ద్వీపంలోని కెపెల్లా హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించానని తెలిపారు. అంతేగాక ఇకనుంచి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని సృష్టం చేశారు. అలాగే అణు నిరాయుధీకరణ దిశగా తొలి అడుగు పడిందన్నారు. రెండు దేశాల మధ్య పెద్ద సమస్యల పరిష్కారానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.