స్వాగతించిన భారత్

స్వాగతించిన భారత్

13-06-2018

స్వాగతించిన భారత్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మద్య సింగపూర్‌లో జరిగిన భేటీని తాము స్వాగతిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. ఇది ఒక సానుకూల పరిణామమని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో చర్చలు, దౌత్య విధానాల ద్వారా శాంతి, సుస్థిరతలను నెలకొల్ఫే ప్రయత్నాలను భారత్‌ అన్నివేళలా సమర్థిస్తుందని తెలిపింది. నాటి భేటీలో ఇరువురునేతల మధ్య కుదిరిన ఒప్పందం అమలు జరగాలని, తద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతలకు మార్గం సుగమమవుతుందని భారత్‌ తన ప్రకటనలో పేర్కొంది.