38 నిమిషాలు.... 100 కోట్లు

38 నిమిషాలు.... 100 కోట్లు

13-06-2018

38 నిమిషాలు.... 100 కోట్లు

ప్రతి ఏటా లక్షల మంది టూరిస్టులను ఆకర్షించే ఓ చిన్న ద్వీపం ఇప్పుడో చారిత్రక సమావేశానికి వేదికైంది. ప్రపంచానికి శాంతి సందేశాన్నిచ్చింది. సింగపూర్‌లోని సెంటోసా ద్వీపంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ 38 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సింగపూర్‌ ప్రభుత్వం ఖర్చుపెట్టిన సొమ్ము అక్షరాలా 101 కోట్ల రూపాయలు. ఇందులో భద్రతా ఏర్పాట్లకే సంగం ఖర్చు అయింది. కిమ్‌ సెయింట్‌ రెగిస్‌ హోటల్‌లో బస చేయడానికి అయ్యే ఖర్చుతోపాటు మొత్తం కొరియా ప్రతినిధుల బృందం ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పిన సింగపూర్‌ ప్రభుత్వం, కాపెల్లా రిసార్ట్‌ ఫ్లైర్‌ స్టార్‌ హోటల్‌లోని 112 గదులను బుక్‌ చేసింది. ఇక్కడ ఒక్క రాత్రికి 400 డాలర్ల ఖర్చు అవుతుంది. ఇక ట్రంప్‌తో పాటు ఆయన బృందం ఉండటానికి షాంగ్రీ లా హోటల్‌ కేటాయించారు. ఈ హోటళ్లలో ఒక్క రాత్రి గడపటానికి సగటున 300 డాలర్లు అవుతుంది. ఈ భేటీని కవర్‌ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి 2500 మంది మీడియా ప్రతినిధులు వచ్చారు.