కిమ్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్

కిమ్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్

13-06-2018

కిమ్ కు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్

యావత్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం ముగిసింది. ఉప్పు, నిప్పూలా ఉండే అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎట్టకేలకు గత వైరాలను పక్కనబెట్టి ఒకరికొకరు స్నేహహస్తాన్ని చాటుకున్నారు. సింగపూర్‌ వేదికగా జరిగిన ట్రంప్‌, కిమ్‌ భేటీ సఫలీకృతం అవడంతో ఇరు నేతలు తమ సొంత దేశాలకు తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్విటర్‌ వేదికగా కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరకొరియా ప్రజల నూతన భవితవ్యం కోసం ధైర్యంగా ముందడుగు వేసిన చైర్మన్‌ కిమ్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నిజమైన మార్పు అనేది సాధ్యమేనని మా తొలి భేటీ నిరూపించింది. అణు విపత్తుకు వెనుకడుగు పడింది. ఇకపై రాకెట్ల ప్రయోగాలు, అణుపరీక్షలు, అధ్యయనాలు ఉండబోవు. బందీలు తమ స్వదేశాలకు వెళ్లొచ్చు. థాంక్యూ కిమ్‌. మన కలయిన చరిత్రాత్మకం అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.