ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

13-06-2018

ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత్‌కు అమ్మడానికి అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆరు ఏహెచ్‌-64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. ఈ డీల్‌ విలువ 93 కోట్ల డాలర్లు (సుమారు రూ.6300 కోట్లు) కావడం విశేషం. అమెరికా విదేశాంగ శాఖ ఈ ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఆమోదం కోసం యూఎస్‌ కాంగ్రెస్‌కు పంపించింది. ఏ చట్టప్రతినిధి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఈ ఒప్పందం అనుకున్న ప్రకారం ముందుకు సాగుతుంది. భారత్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లోనే బొయింగ్‌, టాటా సంస్థలు కలిసి అపాచీ హెలికాప్టర్‌కు సంబంధించిన ప్రధాన బాడీని తయారు చేయడం ప్రారంభించినప్పటికీ, పూర్తిగా తయారుచేసిన హెలికాప్టర్లను అమెరికా నుంచి నేరుగా ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయనున్నారు.  

ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాప్టర్లతో పాటు అత్యాధునిక నైట్‌ విజన్‌ సెన్సార్లు, జీపీఎస్‌ గైడెన్స్‌, స్ట్రింగర్‌ ఎయిర్‌-టు- ఎయిర్‌ క్షిపణులు కూడా సమకూరనున్నాయి. ఈ అపాచీ హెలికాప్టర్లతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని యూఎస్‌ డిఫెన్స్‌ సెక్యూరిటీ కో ఆపరేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది.