ట్రంప్ కుమార్తె, అల్లుడి ఆదాయం ఎంతో తెలుసా?

ట్రంప్ కుమార్తె, అల్లుడి ఆదాయం ఎంతో తెలుసా?

13-06-2018

ట్రంప్ కుమార్తె, అల్లుడి ఆదాయం ఎంతో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్‌ కుష్నెర్‌ గతేడాది 8.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.570 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. వారిద్దరూ శ్వేతసౌధ సీనియర్‌ సలహాదారులుగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో చేసిన పెట్టుబడులపై ఈ మేరకు ఆదాయం వచ్చినట్లు వారు ఆర్థిక పత్రాల్లో పేర్కొన్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది. కుటుంబ స్థిరాస్తి కంపెనీతో సంబంధం ఉన్న అనేక కంపెనీల నుంచి తనకు 7 కోట్ల డాలర్లు లభించినట్లు జేర్డ్‌ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో సేవలందిస్తున్నందువల్ల తమ కంపెనీల రోజువారీ వ్యవహారాలను తాత్కాలికంగా పక్క పెడుతున్నట్లు ఇవాంక దంపతులు గతంలో ప్రకటించారు.