పెన్సిల్వేనియాలో సినారె వర్థంతి సభ

పెన్సిల్వేనియాలో సినారె వర్థంతి సభ

14-06-2018

పెన్సిల్వేనియాలో సినారె వర్థంతి సభ

ఫిలడెల్ఫియా లో మహాకవి డాక్టర్‌ సినారాయణరెడ్డి ప్రధమ వర్ధంతి సభ డాక్టర్‌ సినారాయణరెడ్డి సినీ గీతాలతో ఘనంగా జరిగింది. డాక్టర్‌ సి నారాయణరెడ్డి రచించిన మొదటిగీతమ్‌ నన్ను దోచుకుందువటే తో ప్రారంభమయి సభికులను రంజింప చేసింది. సరోజ సగరం, శ్రీనివాస్‌ సగరం, పోతుకూచి శ్రీనివాస్‌, రవికుమార్‌ రాజు కలిదిండి, మణి, వంశీ ఇంటర్నేషనల్‌ మరియు వేగేశ్న ఫౌండేషన్‌ అధినేత కళాబ్రహ్మ సేవ మహాత్మా శిరోమణి డాక్టర్‌ వంశీ రామరాజు, గాయనీగాయకులు బాలకామేశ్వర రావు, శివశంకరి గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

దేశవిదేశాల తెలుగు వారిని తమరచనల ద్వారా ప్రభావితులను చేసిన మానవతావాది డాక్టర్‌ సి నారాయణరెడ్డి విశ్వకవిగా కీర్తిని పొందారని వక్తలు ప్రస్తుతించారు. మే నెలనుంచి జులై వరకు ఉత్తర అమెరికాలో వేగేశ్న ఫౌండేషన్‌ వికలాంగుల ఆశ్రమం కొరకు ఘంటసాల ఆరాధనోత్సవాలు ఎస్పీ బాలు పాటలతో సంగీతోత్సవాలను నిర్వహిస్తున్నామని వంశీ రామరాజు తెలియచేశారు. ఈ కార్యక్రమాలను ఉత్తర అమెరికాలోని తెలుగు సంస్థలు మరియు వంగూరి ఫౌండేషన్‌ అఫ్‌ అమెరికా, తెలంగాణ టూరిజం సహకరిస్తున్నాయని చెప్పారు.