ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్!

14-06-2018

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్!

పదేండ్ల కాలం నాటి ఓ సెకండ్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ ప్రపంచంలోనే అత్యతం ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌గా రికార్డు సృష్టించింది. ఈ హ్యాండ్‌బ్యాగ్‌ కోసం లండన్‌లో వేలం నిర్వహించారు. ఓ బ్రిటన్‌ వ్యాపారవేత్త ఏకంగా రూ.కోటీ 46 లక్షలు చెల్లించి ఈ బ్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ బ్యాగ్‌ ప్రత్యేకత ఏమిటంటే.. 2008లో ఈ బ్యాగ్‌ను హిమాలయా బిర్కిస్‌ అనే సంస్థ తయారు చేసింది. బ్యాగుపై భాగంలో అత్యంత ఆకర్షణీయంగా ఓ వజ్రాన్ని అమర్చింది. బ్యాగ్‌ తయారీలో అత్యంత నాణ్యతను పాటించింది. ఈ బ్యాగ్‌ను వేలంలో దక్కించుకోవాలని అనేక మంది పోటీపడ్డారు. ఈ కంపెనీల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా బాగా డిమాండ్‌ ఉంది.