హెచ్ డిఎఫ్ సికి అరుదైన గౌరవం

హెచ్ డిఎఫ్ సికి అరుదైన గౌరవం

14-06-2018

హెచ్ డిఎఫ్ సికి అరుదైన గౌరవం

గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక సేవల విభాగంలో పనిచేస్తున్న సంస్థలతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాతితాలో హెచ్‌డీఎఫ్‌సీ అయిదో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. గత ఏడాది హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఇదే జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీతో పాటు ఇండియా బుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ (13వ స్థానంలో) మాత్రమే ఫోర్బ్స్‌ జాబితాలోని తొలి వంద స్థానాల్లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో క్యాపిటల్‌ వన్‌ ఫైనాన్సియల్‌ (159వ స్థానం) వీసా (164), వోరిక్స్‌ (254), పేపాల్‌ (337), సింక్రోనీ ఫైనాన్స్‌ (340), డిస్కవర్‌ ఫైనాన్స్‌ (356), మాస్టర్‌ కార్డ్‌ (367) స్థానం దక్కించుకున్నాయి. మొత్తం 2000 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాలో 58 భారత సంస్థలకు చోటు దక్కడం వివేషం.