మనం కలిసిన రోజు చరిత్రలో నిలిచిపోతుంది

మనం కలిసిన రోజు చరిత్రలో నిలిచిపోతుంది

14-06-2018

మనం కలిసిన రోజు చరిత్రలో నిలిచిపోతుంది

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో తాను జరిపిన అనూహ్య భేటీతో ప్రపంచం ఒక అణు విపత్తు నుంచి బయటపడినట్లయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఉత్తర కొరియా ప్రజలకు సరికొత్త, ఉజ్వల భవితవ్యాన్ని అందించడానికి తొలి సాహసోపేత అడుగు వేసిన కిమ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. నిజమైన మార్పు సాధ్యమేననేది తమ మధ్య తొలిసారిగా జరిగిన భేటీతో రుజువయిందన్నారు. చర్చల తర్వాత సింగపూర్‌ నుంచి వాషింగ్టన్‌కు వస్తూ ట్విటర్లో ఈ మేరకు స్పందించారు. ఇకపై రాకెట్‌ ప్రయోగాలు, అణు పరీక్షలు, అణు పరిశోధనలు ఉండవు. బందీలుగా ఉన్నవారంతా తిరిగి తమ కుటుంబాలను చేరుకుంటారు. ధన్యవాదాలు కిమ్‌. మనం కలిసిన రోజు చరిత్రలో నిలిచిపోతుంది అని పేర్కొన్నారు.