2026 ప్రపంచకప్ ఉత్తర అమెరికాలో

2026 ప్రపంచకప్ ఉత్తర అమెరికాలో

14-06-2018

2026 ప్రపంచకప్ ఉత్తర అమెరికాలో

ఫిపా వరల్డ్‌ కప్‌ 2026 టోర్ని నిర్వహణ హక్కులు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా చేజిక్కించుకున్నాయి. ఈ మూడు ఉత్తర అమెరికా దేశాల బిడ్‌ మొరాకోను వెనక్కి నెట్టింది. మొత్తం 203 ఫిఫా కాంగ్రెస్‌ ఓట్లలో అమెరికా బృందానికి 134 ఓట్లు రాగా, మొరాకోకు 65 వచ్చాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, స్టేడియాలు, రవాణా సదుపాయాలు అమెరికాకు అనుకూలంగా మారగా, మొరాకో అన్నీ కొత్తగా నిర్మించాల్సిన స్థితిలో ఉంది. 2026లోగా అన్ని చేస్తామంటూ మొరాకో ప్రతిపాదనలు ఆచరణలో కష్టసాధ్యమంటూ ఫిఫా భావించింది. 2026 ప్రపంచ కప్‌లో తొలిసారి 48 జట్లు బరిలోకి దిగుతాయి.