మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన అమెరికా

మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన అమెరికా

14-06-2018

మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన అమెరికా

అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరిగాయి. ప్రామాణిక ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతం పెంచింది. తాజా పెంపుతో ఫెడరల్‌ ఫండ్‌ రేటు 1.75-2.0 శాతానికి చేరింది. ఈ ఏడాదిలో ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. చివరిసారి గత మార్చిలో వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఈ సంవత్సరం చివరికల్లా మరో రెండు సార్లు పెంపు ఉంటుందని కూడా అమెరికా ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది.