నాటా మహాసభల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

నాటా మహాసభల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

09-07-2018

నాటా మహాసభల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

నాటా వేడుకల్లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) అధ్యక్షుడు రాజేశ్వర్‌ రంగసాని అన్నారు. ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా మహాసభల్లో వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలు వైఎస్సార్‌ ఫొటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజేశ్వర్‌ రంగసాని మాట్లాడుతూ.. వైఎస్సార్‌ జయంతి వేడుకల కోసం కన్వెన్షన్‌ తేదీలను  మార్చుకున్నామని తెలిపారు. 2020 నాటా మహాసభలకు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో రావాలని కోరుకుంటున్నామని నాటా ప్రెసిడెంట్‌ (ఎలెక్ట్‌) రాఘవ రెడ్డి అన్నారు. నాటా అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలని, దాని కోసం కోటి సంతకాల సేకరణ చేపడతామన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, రాజీనామా చేసిన లోక్‌సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గౌరు చరిత, అనిల్‌కుమార్‌ యాదవ్‌, నాటా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.