న్యూజీలాండ్ టూరిజం సమ్మేళనానికి అజ్మీరా చందూలాల్ గారికి ఆహ్వానం

న్యూజీలాండ్ టూరిజం సమ్మేళనానికి అజ్మీరా చందూలాల్ గారికి ఆహ్వానం

10-07-2018

న్యూజీలాండ్ టూరిజం సమ్మేళనానికి అజ్మీరా చందూలాల్ గారికి ఆహ్వానం

ఇండియా- న్యూజీలాండ్ బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల లో టూరిజం మరియు ఏవియేషన్ రంగాలకు సంబందించిన సమ్మెళనం జరుపుతోంది. ఈ సమ్మేళనానికి సంబందించిన అధికార ఆహ్వాన పత్రాన్ని ఈ రోజు తెరాస న్యూజీలాండ్ జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింగరావు ఇనగంటి గారు తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీ అజ్మీరా చందూలాల్ గారికి  INZBC తరపున హైదరాబాద్ లో అందజేశారు.  ఈ సమ్మేళనంలో న్యూ జీలాండ్ ప్రధాన మంత్రి , టూరిజం శాఖ కాబినెట్ మంత్రి , ఏవియేషన్ మంత్రి ల తో పాటుగా ఇతర మంత్రులు పాల్గొనున్నారని, అలాగే ఈ సమ్మేళనంలో ౩౦౦ దేశ, విదేశాల ప్రతినిధులు పాల్గొనున్నారని, ఈ సమ్మేళనంలో పాల్గొని తెలంగాణ టూరిజం ప్రాముఖ్య ప్రదేశాలు, విశిష్టతల ను వివరించి తెలంగాణ పర్యాటక రంగాన్ని పెంపొందించుకొని గొప్ప అవకాశం అని చందూలాల్  గారికి వివరించి న్యూ జీలాండ్ పర్యటనకు రావాల్సిందిగా కోరానని నర్సింగ రావు ఇనగంటి తెలిపారు అలాగే ఈ అవకాశంకల్పించిన మంత్రి గారికి, INZBC కు, తెలంగాణ రాష్ట్ర సమితి nri కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాలా మరియు న్యూజీలాండ్ తెరాస శాఖ అధ్యక్షుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

Click here for Brochure