ఆకట్టుకున్న నాటా సాహిత్య సమావేశాలు...

ఆకట్టుకున్న నాటా సాహిత్య సమావేశాలు...

10-07-2018

ఆకట్టుకున్న నాటా సాహిత్య సమావేశాలు...

ఫిలడెల్పియాలో జూలై 6, 7, 8 తేదీల్లో జరిగిన నాటా మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమావేశాలు విజయవంతమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ 'భాషా - సాహిత్యం - సమాజం' సెషన్‌ తిమ్మాపురం ప్రకాష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సెషన్‌లో తెలుగులో శాస్త్రీయ సాహిత్యం, వైజ్ఞానిక సాహిత్యం ఆవశ్యకతను గురించి నరిసెట్టి ఇన్నయ్య ప్రసంగించారు. భారతీయ సాహిత్యంలో తెలుగు భాషా స్థానం గురించి హిందీ నుంచి తెలుగులోకి అనేక అనువాదాలు చేసిన ఢిల్లీకి చెందిన లక్ష్మిరెడ్డి సోదాహరణంగా మాట్లాడి సభికులను ఆలోచింప చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ తీరు తెన్నులు, అకాడమీ చేసిన మంచి పనులు, అకాడమీ నిర్వహణలో సాధక బాధకాల గురించి దుగ్గిరాల సుబ్బారావు వివరించారు. తమిళ నాట తెలుగు భాషా ఉద్యమం గురించి నంద్యాల నారాయణ రెడ్డి ఆవేశంతో, ఆవేదనతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.