6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
Sailaja Reddy Alluddu

6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

10-07-2018

6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సాదర ఆహ్వానం

ఒకటా, రెండా...మూడు దేశాలలో తెలుగు భాషా సాహిత్యాల పురోగతికి అహర్నిశలూ కృషి చేస్తున్న నాలుగు సాహిత్య సంస్థలు  సంయుక్తంగా ఆస్ట్రేలియా లో మెల్బోర్న్ మహానగరంలో రాబోయే నవంబర్ 3-4, 2018 తారీకులలో  నిర్వహిస్తున్న 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాష, సాహిత్యాభిమానులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.  

ప్రధాన నిర్వాహక సంస్థలు

గత 26 సంవత్సరాలగా ఆస్ట్రేలియా ఖండంలో తెలుగు భాష, సంస్కృతి, సంగీత, నాట్య కళా రూపాలకి నిరుపమానమైన సేవలందిస్తున్న “ఆస్టేలియా తెలుగు సంఘం” (Telugu Association of Australia, Inc.), మెల్బోర్న్, ఆస్ట్రేలియా ప్రపంచ వ్యాప్తంగా గత 24 వత్సరాలుగా శతాధిక సాహితీ సదస్సులూ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ ద్వారా   అపార అనుభవం గల "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా",  హ్యూస్టన్ (అమెరికా) & హైదరాబాద్ (భారత దేశం) తెలుగు నాట మన భాషా సాహిత్యాల పురోగతికి అలుపెరగని కృషి చేస్తున్న సాహిత్య సంస్థ లోక్ నాయక్ ఫౌండేషన్, విశాఖపట్నం, భారత దేశం.

ఈ మూడు సంస్థలే కాక ఆ ప్రాంతాలలో ఉన్న ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య, సింగపూర్, హాంగ్ కాంగ్, ఇండొనీషియా, మైన్మార్, థాయ్ లాండ్, బాలి, మలేసియా మొదలైన దేశాల లో ఉన్న తెలుగు సంస్థలు  తమ సహకారం అందిస్తున్నారు.

నేపధ్యం

2007 లో మొదలయిన ఈ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల ప్రస్థానం ఇప్పటివరకూ నాలుగు దేశాలలో (భారత దేశంలో హైదరాబాద్ , అమెరికాలో హ్యూస్టన్ మహా నగరం,  యునైటెడ్ కింగ్డం లో లండన్ మహా నగరం, సింగపూర్)  స్థానిక తెలుగు సంఘాల సహకారంతో దిగ్విజయంగా జరిగాయి. శ్రీయుతులు బాపు-రమణ, డా. సినారె, గొల్లపూడి, డా. యార్లగడ్డ, గౌ. మండలి బుద్ద ప్రసాద్, సిరివెన్నెల, జొన్నవిత్తుల, తనికెళ్ళ భరణి, అశోక్ తేజ, భువన చంద్ర, అవధాన సరస్వతి పాలపర్తి, డి. కామేశ్వరి, అక్కిరాజు రమాపతి రావు, ద్వానా శాస్రి , నటుడు బ్రహ్మానందం, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య ముత్యాల నాయుడు, చందు సుబ్బారావు, కె. మల్లీశ్వరి, ముక్తేవి భారతి,  కె. శ్రీనివాస్, హాస్య బ్రహ్మ శంకర నారాయణ, మీగడ రామలింగ స్వామి మొదలైన  సుప్రసిద్ధ సాహితీవేత్తలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెప్టెంబర్, 2014 లో సింగపూర్ లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు 12 దేశాలనుండి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొని సభను దిగ్విజయం చేశారు. 

ఆస్ట్రేలియా ఖండంలో ప్రపంచ స్థాయిలోనే కాక  జాతీయ స్థాయిలో కూడా తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ సాహిత్య సదస్సు జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. 

సదస్సు ప్రధానాంశం 
“తెలుగు సాహిత్యంలో హాస్యం -ఆ నాడూ-ఈ నాడూ” 
సదస్సు ప్రధాన ఆశయాలు

1. ప్రపంచ వ్యాప్తంగానూ, ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆసియా ఖండం లో ఉన్న దేశాలలో నివశిస్తున్న తెలుగు రచయితలూ, పండితులూ, సాహిత్యాభిమానులూ, కలుసుకుని తమ  తెలుగు సాహిత్యాభిమానాన్నీ, తమ రచనలనీ సహ భాషాభిమానులతో, ఆత్మీయ వాతావరణంలో పంచుకునే వేదిక ని కల్పించడం.

2. తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగానే కాక తెలుగు నాట కూడా తగిన గుర్తింపుకి ఆచరణ సాధ్యమైన ప్రణాళికల పై చర్చించడం.

3. తెలుగు భాషకీ, సంస్కృతికీ అనుసంధానమైన తెలుగు సృజనాత్మక సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ  ఆంగ్ల భాషా ప్రభావంలో రెప రెపలాడుతున్న మన సాహిత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం.

4. నిష్ణాతులైన సాహిత్య కారుల ఆహ్లాదకరమైన ప్రసంగాలు వినే అవకాశం కల్పించడం. 

ప్రత్యేక ఆకర్షణలు

స్వీయ రచనా పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు,  అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో....

వక్తలకు, రచయితలకు, సాహితీవేత్తలకు, భాషాభిమానులకూ విన్నపం

ఆస్ట్రేలియా ఖండంలో  మొట్టమొదటి సారిగా అత్యున్నత స్థాయిలో జరగబోయే ఈ ఆరవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని, తమ రచనలనూ, సాహిత్యపరమైన అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ, పాండిత్య ప్రకర్షనూ సహ సాహితీవేత్తలతో పంచుకోమని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాషాభిమానులందరూ ఈమహాసభలకి ఆహ్వానితులే. ముఖ్యంగా స్థానిక రచయితలూ, సాహితీవేత్తలకీ  ఈ 6వ ప్రపంచ సాహితీ సదస్సు తమదే అయిన ఒక ప్రత్యేక వేదిక.  ప్రవేశ రుసుము లేని ఈ ప్రతిష్టాత్మకమైన 6వ  ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రతినిధులుగా రాదల్చుకున్న వారు, ప్రసంగించ దల్చుకున్న వక్తలు ఈ క్రింది వారిని సంప్రదించండి. ఏ దేశం నుంచి అయినా ప్రతినిధుల, వక్తల ఖర్చులకు సదస్సు నిర్వాహకులకు బాధ్యత లేదు. ఎవరి ఖర్చులు వారివే. సదస్సు పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించ బడతాయి.

For More Information, and expression of interest in participation, please contact

సదస్సు సంచాలకులు

Sreeni Katta (President, Telugu Association of Australia, Melbourne)
Phone 61 413 398 940, E-mail: sreenik2004@yahoo.com.au

Dr. Vanguri Chitten Raju (Vanguri Foundation of America)
Phone: (1) 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

ప్రధాన సమన్వయ కర్త: Rao Konchada
Phone: 61 422 116 542, E-mail: rao.konchada@gmail.com

భారత దేశ సమన్వయ కర్త: Dr. Vamsee Ramaraju
Phone: (91) 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in


గౌరవ సలహాదారులు:  “పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (భారత దేశం), సారధి మోటమర్రి (ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య, సిడ్నీ), శాయి రాచకొండ (హ్యూస్టన్)