డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

11-07-2018

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రెంట్‌ కుటుంబాలను చెందిన పిల్లలను దీర్ఘకాలం నిర్బంధంలో వుంచాలన్న ట్రంప్‌ ప్రభుత్వ అభ్యర్థనకు అమెరికా ఫెడరల్‌ న్యాయమూర్తి తిరస్కరించారు. అమెరికా న్యాయ శాఖ చేసిన ప్రతిపాదన వాస్తవ విరుద్దంగా వుందంటూ లాస్‌ఏంజెల్స్‌ న్యాయమూర్తి డాలీ గీ తోసిపుచ్చారు. పిల్లలను దీర్ఘకాలం అలా నిర్బంధంలో వుంచలేమని పేర్కొంటున్న 1997 నాటి ఫ్లోర్స్‌ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం సూచించింది. దాన్ని న్యాయమూర్తి కొట్టివేశారు.