నాటా ముగింపు ఉత్సవాల్లో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

నాటా ముగింపు ఉత్సవాల్లో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

11-07-2018

నాటా ముగింపు ఉత్సవాల్లో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో కాపాడుతున్న ప్రవాసాంధ్రులందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ సహకారం ఉంటుందని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నాటా ఉత్సవాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినప్పటికీ ఆయన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నందున రావడం సాధ్యపడలేదన్నారు. త్వరలోనే పాదయాత్ర ముగుస్తుందని అప్పుడు వైఎస్‌ జగన్‌ అమెరికా వచ్చి ప్రవాసాంధ్రులకు కలుసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా నాటా కమిటీ సభ్యులు డాక్టర్‌ ప్రేమసాగర్‌రెడ్డి, రాజేశ్వర్‌, రాఘవరెడ్డిలను అభినందిస్తూ జగన్‌మోహన్‌ రెడ్డి పంపిన సందేశాన్ని వైవీ సుబ్బారెడ్డి అందరికీ చదివి వినిపించారు.