డొనాల్డ్ ట్రంప్ దే అగ్రస్థానం

డొనాల్డ్ ట్రంప్ దే అగ్రస్థానం

11-07-2018

డొనాల్డ్ ట్రంప్ దే అగ్రస్థానం

ట్విట్టర్‌లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అనుసరిస్తున్న వారున్న (ఫాలోవర్లు) నేతల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి రెండు స్థానాల్లో పోప్‌ ఫ్రాన్సిస్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. బర్సన్‌ కోహన్‌ అండ్‌ వోల్ఫ్‌ (బీసీడబ్ల్యూ) అనే సమాచార సంస్థ ట్విప్లొమసీ పేరిట వెల్లడించిన ఈ అధ్యయనంలో అత్యధిక ఫాలోవర్లున్న ప్రపంచ నేతలు -2018 జాబితాను రూపొందించింది. బీసీడబ్ల్యూ మొత్తం 951 ట్విట్టర్‌ ఖాతాలను సమీక్షించింది. అందులో 13 శాతం క్రియారహితంగా ఉన్నట్లు తేలింది. ట్రంప్‌నకు 5.20 కోట్లు, పోప్‌ ఫ్రాన్సిస్‌కు 4.75 కోట్లు, మోదీకి 4.25 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నట్లు వెల్లడించింది.