అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం

అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం

11-07-2018

అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా తాజాగా మరోసారి చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు ఉత్పత్తులపై సుంకాలు పెంచగా ఇప్పుడు వాటికి అదనంగా మరో 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అదనంగా పది శాతం సుంకాలు పెంచనున్నట్లు అమెరికా సృష్టం చేసింది. ఇటీవల చైనా 34 బిలియన్‌ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతో అమెరికా మరోసారి సుంకాలు పెంచింది.