నాటో దేశాలకు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్

నాటో దేశాలకు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్

11-07-2018

నాటో దేశాలకు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్

నాటో సంకీర్ణ దేశాలకు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాకిచ్చారు. ఆ కూటమి నుంచి తప్పుకుంటామంటూ ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన ఇవాళ తాజాగా మరో ఆరోపణ చేశారు. నాటో దేశాల సదస్సులో పాల్గొనేందుకు బ్రసెల్స్‌కు వచ్చిన ఆయన ఓ ఘాటైన కామెంట్‌ చేశారు. నాటోలో కీలక దేశమైన జర్మనీ, రష్యాతో స్నేహసంబంధంగా మెలుగుతోందన్నారు. రష్యా నుంచి జర్మనీ బిలియన్ల డాలర్ల ఖరీదైన ఇంధనాన్ని ఖరీదు చేస్తోందని ఆరోపించారు. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాలో పాటు కొన్ని యురోపియన్‌ దేశాలు నాటో మిలటరీ దళాన్ని ఏర్పాటు చేశాయి. నాట్‌ను నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీట్‌ ఆర్గనైజేషన్‌గా పిలుస్తారు. చాన్నాళ్లుగా నాటో సంకీర్ణ దళాలు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాయి. ఆఫ్టనిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధాల్లో ఈ దళాలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం 29 దేశాలు నాటోలో సభ్యతం కలిగి ఉన్నాయి.

అయితే  ఆ దేశాలు తమ డిఫెన్స్‌ బడ్జెట్‌లో నాటో కోసం కోటా కేటాయించడం లేదని ట్రంప్‌ ఆరోపిస్తున్నాయి. నాటో దేశాలు తమ రక్షణ వ్వవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. కానీ మరోవైపు నాటో దేశాలు మాత్రం ట్రంప్‌ వాదనను తోసిపుచ్చుతున్నాయి. ప్రతి ఏడాది నాటో సంకీర్ణ దళాల కోసం తమ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ఆ దేశాలు అంటున్నాయి. అమెరికానే ఆ అంశాన్ని విస్మరిస్తోందని నాటో దళాలు ఆరోపిస్తున్నాయి.