మాల్దీవ్స్ లో టిఆర్ఎస్ పార్టీ శాఖ ఆవిర్భావం

మాల్దీవ్స్ లో టిఆర్ఎస్ పార్టీ శాఖ ఆవిర్భావం

11-07-2018

మాల్దీవ్స్ లో టిఆర్ఎస్ పార్టీ శాఖ ఆవిర్భావం

మాల్దీవ్స్ దేశం లో టిఆర్ఎస్ పార్టీ శాఖ ఆవిర్భవించింది. మాల్దీవ్స్ లోని వెయ్యి ఐలాండ్స్ లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అభిమానుల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాల్దీవ్స్ వెళ్లి  ఈ శాఖని ప్రారంబించారు.

మహేష్ బిగాల మాట్లాడుతూ నాలుగు లక్షల జనాభా వున్నా దేశంలో పార్టీ శాఖని ఆరంభించడం ఆనందంగా ఉందని అన్నారు. మాల్దీవ్స్ దేశంలో భారత్ దేశానికి సంబంధించి ఇది వరకు ఎటువంటి సంఘం లేదని టిఆర్ఎస్ శాఖనే మొదటిదని, ఇలా సమావేశాలు పెట్టుకోవడం కూడా మొదటిసారని తెలిపారు. మాలీ ఐలాండ్ లో ప్రారంభించిన శాఖను త్వరలో మిగతా అన్ని ఐలాండ్లలో విస్తరిస్తామన్నారు. ప్రంపంచం లోని చిన్న, పెద్ద దేశాలన్నిటింటిలో సీఎం కెసిఆర్ గారి మీద, టిఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ పెరుగుతుంది.మిగతా అన్ని దేశాలలో గులాబీ  జెండా ను ఎగురవేస్తామన్నారు. ఆఫ్రికా దేశాల నుండి వస్తున్నా విజ్ఞప్తిల మేరకు త్వరలోనే అక్కడ పర్యటించి పలు దేశాలలో శాఖలను ప్రారంభిస్తామన్నారు.

టిఆర్ఎస్ మాల్దీవ్స్ కోర్ కమిటీ  సభ్యులుగా కన్నమల్లా రాకేష్ దత్తాత్రేయ, నరేందర్ ఏలువాల, సంతోష్ కాదయా, మల్లేశం ఈర్ల, షాహిద్ మొహమ్మద్ లను ఎన్నుకున్నారు. టిఆర్ఎస్ ఎన్నారై అడ్వైసర్ ఎంపీ కవిత గారితో చర్చించి పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తామన్నారు.

Click here for Photogallery