న్యూజెర్సీ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్

న్యూజెర్సీ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్

11-07-2018

న్యూజెర్సీ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్

అమెరికాలో తెలుగువారిని ఏకం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. స్థానిక తెలుగువారిలో వాలీబాల్ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ లో తమ సత్తా చాటేందుకు పోటీ పడ్డారు. టోర్నమెంట్ లో భాగంగా మొత్తం 60 మ్యాచ్ లను నాట్స్ నిర్వహించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంటులో రాయల్ రవన్స్  టీం విజేతగా నిలిచింది. బుల్ డాగ్ టీం రన్నరప్ గా నిలిచింది.

చంద్రశేఖర్ కొణిదెల నాయకత్వంలో నిర్వహించిన ఈ  వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావడంలో వంశీ కృష్ణ వెనిగళ్ల,  మోహన్ కుమార్ వెనిగళ్ల ప్రత్యేక పాత్ర పోషించారు. రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, సురేష్ బొల్లు, సూర్య గుత్తికొండ, విష్ణు ఆలూరు, అరుణ్ మదిరాజు, రాజేశ్ బేతపూడి, రవి కొల్లి, శ్రీనివాస్ గరిమెళ్ల తదితర నాట్స్ న్యూజెర్సీ టీమ్ ప్రతినిధులు కూడా ఈ టోర్నమెంటు విజయానికి తమవంతు సహాయ సహకారాలు అందించారు.

నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, శ్యాం నాళం, విమల్ కావూరు, వలివేటి బ్రహ్మజీ, మహేందర్ కొర్రపాటి  తదితర నాట్స్ నాయకులు ఈ మ్యాచ్ లను ఆసక్తిగా తిలకించారు. తమ ప్రతిస్పందనలతో వాలీబాల్ ప్లేయర్లలో ఉత్సాహం నింపేలా వ్యవహరించారు. ఈ టోర్నమెంట్ లో విజేతలకు నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ బహుమతులు అందించారు. న్యూజెర్సీ నాట్స్ నాయకత్వం ఈ టోర్నమెంట్ ను విజయవంతగా నిర్వహించినందుకు నాట్స్  జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. న్యూజెర్సీ నాట్స్ టీమ్  సమిష్టి కృషితోనే ఇలాంటివి సాధ్యమయ్యాయని.. ఇలాంటి మరిన్ని టోర్నమెంటులు, ఈవెంట్ లకు ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొంది. బావర్చి ప్రాంక్లిన్ పార్క్ ఈ ఈవెంట్ కు స్పాన్సర్ గా వ్యవహారించింది.

Click here for Event Gallery