60 ఏళ్లుగా పెంపు... న్యూయార్క్ మ్యూజియంలో భద్రం
Sailaja Reddy Alluddu

60 ఏళ్లుగా పెంపు... న్యూయార్క్ మ్యూజియంలో భద్రం

12-07-2018

60 ఏళ్లుగా పెంపు... న్యూయార్క్ మ్యూజియంలో భద్రం

చేతివేళ్లకు గోర్లు కొద్దిగా పెరిగితేనే చికాకేసి కత్తిరించేస్తాం. అతడికి మాత్రం గోర్లంటే ఎత మోజో. తన ఎడమ చేతి గోర్లను 66 ఏళ్లుగా కట్‌ చేయలేదతను. అవి చాంతాడంత పెరిగిపోయి ఊడలను తలపించడంతో ప్రపంచంలో ఎవ్వరూ ఇంత పొడవు గోర్లు పెంచలేదంటూ గిన్నిస్‌ అధికారులొచ్చి ఓ సర్టిపికెట్‌ కూడా ఇచ్చి వెళ్లారు. 82 ఏళ్ల ముదిమి వయసులో ఇప్పుడాయన గోర్లు కట్‌ మనిపించాడు. పుణె వాస్తవ్యుడైన శ్రీధర్‌ చిల్లాల్‌ 1952 నుంచి తన ఎడమ చేతి గోర్లను పెంచుతున్నాడు. అలా అని చిల్లాల్‌ తన గోర్లకు ఉత్త పుణ్యానికే కత్తిరించుకోలేదు. న్యూయార్క్‌లోని ఓ మ్యూజియం నిర్వాహకులు కట్‌ చేసిన గోర్లను పదికాలాల పాటు భద్రపరుస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకొన్నాడు. ఆ మ్యూజియంలో చిల్లాల్‌కు గోర్ల కత్తిరింపు వేడుకు ను ఘనంగా నిర్వహించారు. ఆ గోర్లను ఈ చివర నుంచి ఆ చివరకు పరిలిస్తే 9.1 మీటర్ల పొడవు ఉన్నట్లు తేలింది.