జూలై 15న టాంటెక్స్ సాహిత్య విందు

జూలై 15న టాంటెక్స్ సాహిత్య విందు

12-07-2018

జూలై 15న టాంటెక్స్ సాహిత్య విందు

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం నెల నెలా తెలుగు వెన్నెల పేరుతో సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 15న 11వ వార్షికోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సెంట్‌ మేరీస్‌ మలంకార ఆర్థడాక్స్‌ చర్చ్‌లో జరిగే ఈ వేడుకల్లో పలువురు సాహిత్య ప్రముఖులు పాల్గొంటున్నారు. నందమూరి లక్ష్మీపార్వతి, సత్యనారాయణ, టీవిఆర్‌ కె మూర్తి, ముక్తేవి రవీంద్రనాథ్‌, ఎస్‌.ఎస్‌. మూర్తి, డా. వైజర్స్‌ బాలసుబ్రహ్మణ్యం,  డా. హలీంఖాన్‌ తదితరులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఈ వేడుకలకు అందరూ రావాల్సిందిగా టాంటెక్స్‌ తెలుగు సాహిత్యవేదిక కోరుతోంది.