అమెరికా వచ్చే పర్యాటకుల కోసం విజిటర్స్‌కవరేజ్‌ కొత్త పథకం 'కవర్ అమెరికా గోల్డ్'

అమెరికా వచ్చే పర్యాటకుల కోసం విజిటర్స్‌కవరేజ్‌ కొత్త పథకం 'కవర్ అమెరికా గోల్డ్'

01-08-2018

అమెరికా వచ్చే పర్యాటకుల కోసం విజిటర్స్‌కవరేజ్‌ కొత్త పథకం 'కవర్ అమెరికా గోల్డ్'

సమ్మర్‌లో అమెరికా టూర్‌ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీరు కవర్‌ అమెరికా గోల్డ్‌ బీమా చేయించుకోండి. మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేయండని ప్రముఖ ఇన్‌స్యూరెన్స్‌ సంస్థ విజిటర్స్‌కవరేజ్‌ సూచిస్తోంది.

చాలామంది సమ్మర్‌ హాలిడేస్‌లో అమెరికాలోని పర్యాటక ప్రాంతాలైన బీచ్‌లను, పార్క్‌లను, అడవులను ఇతర ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఈ పర్యటన సమయాల్లో మీకు అనుకోని ప్రమాదం ఎదురవ్వచ్చు. అది సూర్యరశ్మి వల్ల కావచ్చు, లేదా విషపురుగుకాటు వల్ల కావచ్చు. లేదా సుదూర ప్రయాణం వల్ల కూడా అనారోగ్యపాలు కావచ్చు. ఇలాంటి సమయంలో అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్‌ ఎక్కాల్సి ఉంటుంది. వేల డాలర్లను చికిత్స కోసం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాల్లో అదృష్టవశాత్తు మీ మెడికల్‌ ఖర్చును భరించే పాలసీ మీ దగ్గర ఉంటే మీరు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో విజిటర్స్‌కవరేజ్‌ సంస్థ 'కవర్‌ అమెరికా గోల్డ్‌' పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీని మీరు తీసుకోవడం వల్ల మీ చికిత్సలకు అయ్యే ఖర్చును ఈ సంస్థనే చెల్లిస్తుంది.

అమెరికా వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కవర్‌ అమెరికా గోల్డ్‌ పేరిట ఓ మెడికల్‌ ఇన్‌స్యూరెన్స్‌ స్కీమ్‌ను విజిటర్స్‌కవరేజ్‌ ప్రవేశపెట్టింది. ఈ పాలసీ వల్ల మీరు నిశ్చింతగా పర్యాటక ప్రదేశాలను హాయిగా ఉల్లాసంగా సందర్శించి రావచ్చు. దూరప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని ఇబ్బందులపాలు కాకుండా ఒత్తిడికి దూరంగా ఉండేలా ఈ పాలసీ కాపాడుతుంది. ఈ కవర్‌ అమెరికా-గోల్డ్‌ స్కీమ్‌ను అమెరికాకు వచ్చే పర్యాటకులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ పాలసీ వల్ల పర్యాటక ప్రదేశాల్లో పయనించే సమయంలో ఎదురయ్యే గాయాల నుంచే కాకుండా, బోర్డర్‌ ఎంట్రీ ప్రొటెక్షన్‌ నుంచి కూడా మీకు రక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ పాలసీని మీరు ఎంచుకుని ప్రీమియం చెల్లించిన వెంటనే మీకు వందశాతం రక్షణ లభిస్తుంది. పిపిఓ నెట్‌వర్క్‌ ద్వారా మెడికల్‌ ఖర్చులను ఈ స్కీం కింద చెల్లిస్తారు. ఈ పాలసీని తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా హాయిగా అమెరికాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

విజిటర్స్‌కవరేజ్‌ ఇంక్‌ సిఇఓ రాజీవ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కవర్‌ అమెరికా గోల్డ్‌ నిజంగా పర్యాటకులకు బంగారంలాంటి పాలసీ అని అంటూ, అమెరికాలో పర్యటించాలనుకునేవారికి ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విదేశీ పర్యాటకులకు బాగా ఉపయోగపడేలా ఈ పాలసీని తయారుచేశామని తెలిపారు.

బోర్డర్‌ ఎంట్రీ ప్రొటెక్షన్‌ పెంపు

బి2 వీసా మీద అమెరికా వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, అమెరికాలోని తమవారిని చూసేందుకు వచ్చే కుటుంబీకులు, స్నేహితులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా కవర్‌ అమెరికా గోల్డ్‌ పాలసీ  ఉపయోగపడుతుంది. ఈ పాలసీదారుడు ఎవరైనా యుఎస్‌లోకి రావడాన్ని అడ్డుకుంటే కామన్‌ కెరీర్‌ ఛేంజ్‌ ఫీజు కింద 550 డాలర్లను పాలసీ చెల్లిస్తుంది.

50,000 డాలర్ల పాలసీని తీసుకున్నవారు అత్యవసర చికిత్సకు తనవంతుగా 25డాలర్లను చెల్లిస్తేచాలు. 100,000 డాలర్ల పాలసీని తీసుకున్నవారు అత్యవసర చికిత్సకు 20డాలర్లు చెల్లించి చికిత్స పొందవచ్చు. పర్యాటకులకు సులభంగా ఉండేందుకు వీలుగా ఈ పాలసీని తయారు చేశారు. డాక్టర్‌లు రాసిన మందులు, ఇతర మెడికల్‌ సర్వీసెస్‌ కోసం ఉచిత డిస్కౌంట్‌ కార్డ్‌ను కూడా విజిటర్స్‌ కవరేజ్‌ అందిస్తుంది. దీనివల్ల మందుల కొనుగోలు, ఇతరవాటిల్లో మీకు రాయితీ లభిస్తుంది.

ఈ సమ్మర్‌లో పర్యటనకువచ్చేవారు రిస్క్‌ తీసుకోకుండా ప్రయాణించండి.  అమెరికాలో మీరు సురక్షితంగా ప్రయాణించడానికి మీ వెంట కవర్‌ అమెరికా గోల్డ్‌ పాలసీ ఉంటే చాలు అన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇతర విషయాల కోసం కంపెనీ వెబ్‌సైట్‌ను చూడండి.

www.visitorscoverage.com/visitor-health-insurance/plans/


Click here for Cover America Gold Brochure