రాజకీయాల్లోకి రాను.. ఇక కుటుంబంపైనే దృష్టి

రాజకీయాల్లోకి రాను.. ఇక కుటుంబంపైనే దృష్టి

08-08-2018

రాజకీయాల్లోకి రాను.. ఇక కుటుంబంపైనే దృష్టి

రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని పెప్సికో సిఇఒ ఇంద్రా నూయి సృష్టం చేశారు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక కుటుంబపైనే పూర్తిగా దృష్టి సారించనున్నట్లు ఆమె చెప్పారు. తరువాత ఏం చేయాలనేది ఇంకా ఏం ఆలోచించుకోలేదు. కానీ, ఇక ఆఫీసుకు మాత్రం పరిగెత్త దల్చుకోలేదు అని పేర్కొన్నారు. రాజకీయాలు తనవల్ల కాదని సృష్టం చేశారు. అయితే కార్పొరేట్‌ రంగంలోని ఇతర మహిళల్ని తనలా ఉన్నత స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తానని, వారికి మార్గదర్శిగా, మద్దతుదారుగా ఉంటానన్నారు. మహిళల ప్రగతికి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని అమె అభిప్రాయపడ్డారు.