చైనా-అమెరికా మధ్య టారిఫ్ ల యుద్ధం!

చైనా-అమెరికా మధ్య టారిఫ్ ల యుద్ధం!

09-08-2018

చైనా-అమెరికా మధ్య టారిఫ్ ల యుద్ధం!

 

చైనా, అమెరికా మధ్య టారిఫ్‌ల యుద్ధం ముదురుతోంది. తాజాగా మరో 16 బిలియన్‌ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాల విధింపు ప్రతిపాదనను ఈ నెల 23 నుంచి అమలు చేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. తొలి విడతగా జూలై 6న 34 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించింది. చైనా, పలు ఇతర దేశాల అనుచిత వాణిజ్య విధానాలు తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల యుద్దానికి తెరతీయడం తెలిసిందే.