రేపల్లెలో డిజిటల్ తరగతి గది ప్రారంభం

రేపల్లెలో డిజిటల్ తరగతి గది ప్రారంభం

09-08-2018

రేపల్లెలో డిజిటల్ తరగతి గది ప్రారంభం

 గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని గూడవల్లి హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతి గదిని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏప్రిల్‌ నాటికీ అన్ని పాఠశాలలో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ప్రవాసాంధ్రులు గూడవల్లి గ్రామానికి చెందిన కొడాలి నరేంద్ర, కొడాలి శ్రీకాంత్‌ లు ఈ డిజిటల్‌ తరగతి ఏర్పాటుకు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ గ్రామ ప్రముఖులు డా. కొడాలి పాపారావు, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.