ఏంజిలినా జోలీకి రూ.61 కోట్లు ఇచ్చాను!

ఏంజిలినా జోలీకి రూ.61 కోట్లు ఇచ్చాను!

09-08-2018

ఏంజిలినా జోలీకి రూ.61 కోట్లు ఇచ్చాను!

తన మాజీ భార్య ఏంజిలినా జోలీకి 9 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.61 కోట్లు) ఇచ్చానని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌. రెండేళ్ల క్రితం బ్రాడ్‌పిట్‌, జోలీ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏంజిలినా- బ్రాడ్‌కు ఆరుగురు సంతానం. ఆరుగురిలో ఇద్దరిని దత్తత తీసుకున్నారు. బ్రాడ్‌పిట్‌కు తాగుడు అలవాటు ఉందని, పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నాడన్న కారణంగా జోలీ అతనికి విడాకులు ఇచ్చారు. కానీ పిల్లల సంరక్షణ బాధ్యతను మాత్రం న్యాయస్థానం జోలీకే అప్పగించింది. అయితే పిల్లల అవసరాలు తీర్చేందుకు, వారిని పోషించేందుకు బ్రాడ్‌పిట్‌ కావాల్సినంత నగదు ఇవ్వలేదని గతవారం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బ్రాడ్‌పిట్‌ స్పందిస్తూ, తాను జోలీతో విడిపోయినప్పుడే 9 మిలియన్‌ డాలర్లు ఇచ్చానని అంటున్నారు. జోలీ తన పేరును చెడగొట్టడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని బ్రాడ్‌పిట్‌ తరపు న్యాయవాదులు అంటున్నారు. మరోపక్క పిల్లల విషయంలో జాయింట్‌ కస్టడీ ఇవ్వాలని బ్రాడ్‌పిట్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు.