రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా ?

రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా ?

10-08-2018

రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా ?

ఆరోగ్యానికి నిద్రే కీలకం. నిద్ర సరిగా లేకపోతే లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే అతిగా నిద్రపోతే అకాల మరణం సంభవించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలింది. రోజుకు 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే అకాల మరణ ముప్పు ఉందని వెల్లడైంది. 10 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయిన వారు 33 శాతం త్వరగా చనిపోయే అవకాశం ఉందని, వాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు.