అతిగా వ్యాయామం చేసేవారికి హెచ్చరిక !

అతిగా వ్యాయామం చేసేవారికి హెచ్చరిక !

10-08-2018

అతిగా వ్యాయామం చేసేవారికి హెచ్చరిక !

అతిగా వ్యాయామం చేసేవారికి హెచ్చరిక. ఈ అలవాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యేల్‌ వర్సిటీ నిపుణులు దీన్ని చేపట్టారు. 12 లక్షల మంది సమాచారాన్ని వీరి విశ్లేషించారు. దీంతో రోజులో మూడు గంటలకుపైగా వ్యాయామం చేసేవారికి మానసిక సమస్యలు చుట్టుముట్టే అవకాశముందని తేలింది. అసలు ఏ వ్యాయామం చేయని వారి కంటే వీరు మానసిక అనారోగ్యంతో నెలలో 1.5 రోజులు ఎక్కువగా బాధపడుతున్నట్లు వెల్లడైంది. నెలలో 23 కంటే ఎక్కువ రోజులు 90 నిమిషాల కంటే ఎక్కువసేపు వ్యాయామం చేసేవారిలో ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంటోంది. వారంలో ఐదుసార్లు 45 నిమిషాలు చొప్పున కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అని పరిశోధకులు అడం చెక్‌రౌండ్‌ తెలిపారు. రోజూ 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేస్తే సరిపోతుందని ఆయన సూచించారు.