అమెరికా శాస్త్రవేత్తకు గీతం అవార్డు

అమెరికా శాస్త్రవేత్తకు గీతం అవార్డు

10-08-2018

అమెరికా శాస్త్రవేత్తకు గీతం అవార్డు

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 38వ వ్వవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.ప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ (న్యూయార్క్‌) ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. 2017 నోబెల్‌ బహుమతి గ్రహీతలలో ఒకరైన ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డు కింద పది లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని గీతం అధ్యక్షులు డాక్టర్‌ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి చేతలు మీదుగా అందజేస్తామన్నారు.