డొనాల్డ్ ట్రంప్ అత్తమామలకు అమెరికా పౌరసత్వం!

డొనాల్డ్ ట్రంప్ అత్తమామలకు అమెరికా పౌరసత్వం!

10-08-2018

డొనాల్డ్ ట్రంప్ అత్తమామలకు అమెరికా పౌరసత్వం!

తొలి మహిళ మెలానియా ట్రంప్‌ తల్లిదండ్రులకు ఎట్టకేలకు అమెరికా పౌరసత్వం లభించింది. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అత్తమామలు విక్టర్‌, అమాలిజా క్నావ్స్‌ అమెరికా పౌరులుగా ప్రమాణం చేశారని, చైన్‌ మైగ్రేషన్‌ విధానంలో వీరికి పౌరసత్వం లభించిందని అధికారులు వెల్లడించారు. కాగా, సాల్వేనియా నుంచి అమెరికాకు వలస వచ్చిన వీరిద్దరికీ, ప్రస్తుతం చట్టబద్ధమైన శాశ్వత నివాసదారుల హోదా ఉంది. ట్రంప్‌ అధ్యక్షుడైన తరువాత వీరిద్దరికీ పౌరసత్వం లభిస్తుందని అందరూ భావించారు. తాజాగా, అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి అయింది. మన్‌ హటన్‌ ఫెడరల్‌ బిల్లిండ్‌ లో హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారుల సమక్షంలో వీరు ప్రమాణం చేశారని విక్టర్‌ తరపు న్యాయవాది మైఖేల్‌ వీల్డ్స్‌ వెల్లడించారు. అయితే, తన తల్లిండ్రులకు పౌరసత్వంపై వ్యాఖ్యానించేందుకు మెలానియా నిరాకరించడం గమనార్హం. వారు ఇరువూరు పాలనలో భాగస్వామలు కాదు కాబట్టి, మెలానియా స్పందిచాల్సిన అవసరం లేదని ఆమె తరపు ప్రతినిధి స్టెఫానీ గ్రిషామ్‌ వెల్లడించారు.