గణతంత్ర దినోత్సవాలకు డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారా?

గణతంత్ర దినోత్సవాలకు డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారా?

10-08-2018

గణతంత్ర దినోత్సవాలకు డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారా?

2019 జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాబోతున్నారా? ప్రభుత్వ వర్గాల aసమాచారం ప్రకారం ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. భారతదేశం, అమెరికా అధికారులు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. డొనాల్డ్‌ ట్రంప్‌ కేవలం గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా భారతదేశానికి రావడం మాత్రమే కాకుండా వివిధ ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేందుకు తగిన అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆయన రాబోయే తేదీ, సమయం, సందర్భం గురించి ఇంకా సృష్టత రాలేదని, చాలా అంశాలను పరిశీలిస్తున్నామని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. భారతదేశంలో పర్యటించాలని డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రభుత్వం ఆహ్వానించిందని, ఇరు దేశాల అధికారుల మధ్య జరుగుతన్న చర్చల సందర్భంగా గణతంత్ర దినోత్సవాల ప్రస్తావన వచ్చిందని తెలిపారు.